హరిహర వీరమల్లు టీమ్ సర్ ప్రైజింగ్ అప్ డేట్

hari hara veera mallu surprising update on VFX work

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈసినిమా కోసం పవన్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కొంచం పెండింగ్ లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా గురించి అందరూ మరిచిపోతున్న తరుణంలో తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు సినిమా నుండి అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా సినీ లవర్స్ కోసం.. ప్రస్తుతం ఈసినిమా హై ఎండ్ విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి.. ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై ఇంకా హైద్రాబాద్ లో విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి.. మీ ఇమాజినేషన్ ను మించేలా ఉంటాయి విజువల్స్.. సో ఆ థ్రిల్ ను పొందటానికి వెయిట్ చేయండి.. త్వరలోనే ఒక స్పెషల్ ప్రోమోతో వస్తామని తెలిపారు.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 16 =