మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా టైటిల్ ను, కాన్సెప్ట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆవీడియోకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇదిలా ఉండగా ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈమధ్యే ఈసినిమా యాక్షన్ కొరియోగ్రఫి సెషన్స్ మొదలు అని అప్ డేట్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో హీరోయిన్ గా త్రిష నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈమేరకు త్రిషకు చిత్రయూనిట్ సెట్ లోకి ఆహ్వానం పలికింది. ఇక త్రిష కూడా దాదాపు 18 ఏళ్ల తరువాత మరోసారి చిరంజీవితో కలిసి నటిస్తుండటంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. కాగా చిరు-త్రిష కలిసి గతంలో స్టాలిన్ సినిమాలో కలిసి చేసిన సంగతి తెలిసిందే కదా.
What an honour it is to reunite with the one and only MEGASTAR after 18 years.Thank you so much for the warmest welcome Chiru sir❤️@KChiruTweets https://t.co/PSrJ4O7LEW
— Trish (@trishtrashers) February 5, 2024
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: