ఓటిటిలోకి వచ్చేసిన సైంధవ్

Saindhav now streaming on amazon prime

ఈసంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు విడుదలకాగా ఇందులో ఒక సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేసింది అదే సైంధవ్.సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది.వెంకీకి ఇది 75వ సినిమా కూడా అయితే ఈసినిమా అనుకున్నంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.ఇక ఇప్పుడు ఓటిటి లో విడుదలైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ తెలుగు తోపాటు తమిళ,మలయాళ భాషల్లో ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.హిట్ ఫేమ్ శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేయగా శ్రద్దా శ్రీనాథ్,రుహాణి శర్మ ,ఆండ్రియా జెర్మియా ,నవాజుద్దీన్ సిద్దిఖీ ,ఆర్య కీలక పాత్రల్లో నటించారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించాడు.

ఇక ఈసినిమా తరువాత వెంకటేష్ తన తదుపరి సినిమాను ఇంకా కమిట్ అవ్వలేదు అయితే తనకు ఎఫ్ 2 &ఎఫ్ 3 వంటి బ్లాక్ బాస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి తో వెంకీ సినిమా చేయనున్నాడని టాక్ నడుస్తుంది.సోలో హీరోగానే ఈసినిమా చేయనున్నాడట వెంకీ. రూరల్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేస్తున్నారట.త్వరలోనే ఈసినిమా విషయంలో క్లారిటీ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.