మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర కు సాలిడ్ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నారు మేకర్స్.ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలచేస్తున్నామని ఈ రోజు పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఈరిలీజ్ డేట్ సినిమాకు బాగా కలిసిరానుంది.జనవరి 10న అనగా శుక్రవారం రిలీజ్ అవుతుండగా ఆతరువాతి రెండు రోజులు వీకెండ్ ఇక సోమవారం భోగి,మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ ఇలా 5రోజులు హాలిడేస్ రానున్నాయి దాంతో హిట్ టాక్ వస్తే చాలు ఈసినిమా సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విశ్వంభర వచ్చే సంక్రాంతికి ఫస్ట్ బెర్త్ ను కంఫర్మ్ చేసుకుంది మరి ఈసినిమాతో పాటు ఎన్ని సినిమాలు పండగ బరిలో నిలుస్తాయో చూడాలి.ఇదిలావుంటే ఈ రోజు నుండి విశ్వంభర కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోస్ లో స్టార్ట్ అయ్యింది.ఈ షెడ్యూల్ లో చిరంజీవి జాయిన్ అయ్యారు.
చాలా రోజుల గ్యాప్ తరువాత మళ్ళీ ఆయన సెట్ లో అడుగుపెట్టారు.సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో బింబిసారా ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈసినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: