దసరా కు కన్నప్ప రిలీజ్ ప్లాన్?

manchu vishnu kannappa movie release plan update

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. త్వరలో సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలోనే సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించడానికి ముందు శివశంకర్ గురూజీని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు రీసెంట్ గా వీడియోను కూడా పోస్ట్ చేశాడు విష్ణు తన ఇన్ట్సాలో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దసరా సెలవులు కూడా ఈసినిమాకు కలిసొస్తాయని ఆలోచిస్తున్నారట మేకర్స్. మరి చూద్దాం దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ విష్ణు తనయుడు అవ్రామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఇంకా పలువురు స్టార్లు ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్‌ ఇంకా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + eight =