పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు సుజీత్. ఈసినిమా ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. ఇప్పటివరకూ మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో మేకర్స్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తూనే వచ్చారు. అయితే పవన్ గత కొద్దిరోజులుగా రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో ఈమధ్య మేకర్స్ కూడా కొద్ది రోజులు ఈసినిమా నుండి అప్ డేట్లు ఉండవని క్లారిటీ కూడా ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా చాలా రోజుల తరువాత ఇప్పుడు ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈసినిమాను సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరి ఈ న్యూస్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
Date locked for the FIRE STORM to HIT SCREENS ☄️
Powerstar #PawanKalyan’s Highly Anticipated #OG to have a Grand Release Worldwide on September 27th, 2024!🔥#TheyCallHimOG #FireStormIsComing @PawanKalyan #Sujeeth @DVVMovies #TeluguFilmNagar pic.twitter.com/u75R3JWM0i— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2024
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: