కన్నప్ప లో హైలెట్ గా ఆ ఎపిసోడ్

interesting update on kannappa movie interval sequence

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే న్యూజిలాండ్ లో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈసినిమాతోనే మంచు ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ కూడా పరిచయం కాబోతుంది. విష్ణు తనయుడు అవ్రామ్ ఈసినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా నెక్స్ట్ షెడ్యూల్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారట. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్‌ కూడా వేశారట. ఈ ఇంటర్వెల్ లోనే శివుడి పాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని చెబుతున్నారు. మరి శివుడి పాత్రలో ఎవరు నటించబోతున్నారో ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే నిజంగానే ఇంటర్వెల్ బ్యాంక్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. ఇంకా పలువురు స్టార్లు ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్‌ ఇంకా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 19 =