అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ 19న విడుదలై మంచి విజయం సాధించింది. ఎమోషనల్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈసినిమా ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ కు అలానే విలన్ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్ కు అవార్డులు దక్కాయి. ఈమేరకు చిత్రయూనిట్ ఈవిషయాన్ని తెలియచేస్తూ శుభాకాంక్షలు తెలియచేసింది. కంగ్రాచ్యూలేషన్స్ కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్.. భగవంత్ కేసరి సినిమాలోని తమ బ్రిలియంట్ పెర్ఫామెన్స్ కు గాను 16వ జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో భాగంగా ఆనర్ ఆఫ్ ద సినిమా అనే అవార్జులు గెలుచుకున్నారని తెలిపారు.
Congratulations to @MsKajalAggarwal and @rampalarjun for being awarded the ‘Honour of the Cinema’ at the 16th Jaipur International Film Festival Awards for their brilliant performance in #BhagavanthKesari ❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MusicThaman… pic.twitter.com/ZvcuYFZ3UQ
— Shine Screens (@Shine_Screens) January 27, 2024
కాగా కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల మరో కీలక పాత్రలో నటించింది. ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్ చేసిన శ్రీలీల ఈసినిమాలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈసినిమాకు
సినిమాటోగ్రఫి.. సి.రామ్ ప్రసాద్, సంగీతం.. ఎస్ థమన్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: