కన్ఫామ్.. NBK 109 లో యానిమల్ విలన్

bobby deol on board for NBK109 movie

బాలీవుడ్ స్టార్ హీరో బాబి డియోల్ క్రేజ్ మాత్రం యానిమల్ సినిమా తరువాత బాగా పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సౌత్ లో బాబి డియోల్ కు వరుస్ అవకాశాలు వస్తున్నాయి. ఇక నేడు బాబి డియోల్ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కంగువ సినిమాలో తను నటిస్తుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ ఫుల్ గా ఉన్న బాబి డియోల్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మరో సినిమాలో తను నటిస్తున్నట్టు కన్ఫామ్ చేశారు. ఆసినిమా మరోదే కాదు బాలకృష్ణ హీరోగా వస్తున్న కొత్త సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాబి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈసినిమాలో బాబి డియోల్ నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈసినిమాలో బాబి డియోల్ నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.

కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాకి దర్శకత్వాన్ని వహించిన బాబీ ఈ సినిమాకి దర్శకుడు కావడంతో ఇప్పుడు బాలయ్య సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.