ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం అనేది కామన్. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతుంది. వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా టైటిల్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే టైటిల్ తో పాటు నితిన్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు. రాబిన్ హుడ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇక వీడియోలో డబ్బు చాలా చెడ్డది, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు మధ్య చిచ్చు పెడుతుంది.. అన్నట్టే చేస్తుంది. అయిన వాళ్ల దగ్గర నుండి తీసుకోవడం నా రైట్.. ఎందుకంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ నితిన్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చూడబోతే ఈసినిమాలో నితిన్ రాబరీస్ చేసే రోల్ లో నటిస్తున్నట్టు అర్థమవుతుంది.
Unmasking the Con Man from the most entertaining & adventurous world 💥💥
Say hello to your new family member – #ROBINHOOD ❤️🔥
Title reveal glimpse out now!
– https://t.co/BoPSPtzMT4#IdhiVere #VN2 @actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/liAOgVVKwD— Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2024
కాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: