సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది. ఈసినిమా ఫైనల్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈసినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. చెప్పినట్టే ఈసినిమాను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈసినిమా అందుబాటులో ఉంది.
కాగా ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటించారు
టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ నిర్మించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈసినిమా అమిత్ రాయ్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: