బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఈమధ్య ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటించింది కంగనా రనౌత్. ఇప్పుడు మరో పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. కంగనా ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ సినిమా వస్తుంది. అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ అప్పుడు ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఎప్పుడోో రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే వాయిదా పడుతూ వస్తుంది. కొద్దిరోజుల క్రితమే ఈసినిమా 2024 లో రిలీజ్ అవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫైనల్ గా ఈసినిమా రిలీడ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను 2024 జూన్14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Unlock the story behind India’s darkest hour. Announcing #Emergency on 14th June, 2024.
Witness history come alive as the most feared & fiercest Prime Minister #IndiraGandhi thunders into cinemas. 🔥 #Emergency in cinemas on 14th June, 2024.@KanganaTeam @AnupamPKher… pic.twitter.com/lo0J2h4S10
— Zee Studios (@ZeeStudios_) January 23, 2024
కాగా ఈసినిమాలో కంగనా నటిస్తూనే దర్శకత్వం వహిస్తుంది.. అలానే నిర్మాతగా కూడా తనే వ్యవహరిస్తుంది. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్ పై కంగనా ఈసినిమాను నిర్మిస్తుంది. ఇంకా ఈసినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయ తల్పాడే, సతీష్ కౌషిక్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































