బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్, క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘యానిమల్’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, త్రిప్తి డిమ్రీ ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. రణ్‍బీర్ కపూర్ అద్భుతమైన నటనకు సందీప్ వంగా టేకింగ్ తోడవడంతో ‘యానిమల్’ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ క్రమంలో మొత్తం రూ.900 కోట్లకు పైబడి వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే, తాజాగా యానిమల్ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా రైట్స్ ను అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో యానిమల్ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఇటీవలే ప్రకటించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న యానిమల్ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీని థియేటర్లో చూడనివారు ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని నెట్‌ఫ్లిక్స్ కల్పించింది. అలాగే ఇప్పటికే థియేటర్లో ఈ సినిమాను చూసినవారు, మరోసారి తిలకించే అవకాశం లభించింది. సో.. మూవీ లవర్స్ గెట్ రెడీ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: