యాత్ర 2 నుండి.. చూడు నాన వీడియో సాంగ్ రిలీజ్

Choodu Nana Video Song Out From Yatra 2 Movie

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యాత్ర 2’. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ‘యాత్ర 2’ నుంచి మోషన్ పోస్టర్, ఫ‌స్ట్‌లుక్, టీజర్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. యాత్ర 2 నుండి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ‘చూడు నాన’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చగా.. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. అద్భుతమైన ఎమోషన్స్‌తో హృద్యంగా సాగిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇందులో జగన్ పాదయాత్ర చేస్తుండగా.. ఆయనను చూసేందుకు, ఆయనతోపాటు నడిచేందుకు వేలాదిగా జనం తరలిరావడం కనిపించింది. జీవా తనదైన నటనతో వైఎస్ జగన్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

కాగా ‘యాత్ర 2’లో ప్రధానంగా సీఎం జగన్ రాజకీయ రంగప్రవేశం, అందుకు దారి తీసిన పరిస్థితులు, సొంతంగా వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించడం, ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం.. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వంటివాటిని చూపించనున్నారు. ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. ఫిబ్రవరి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 9 =