టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్‍ని క్రియేట్ చేస్తోంది. ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో చిత్రబృందం తాజాగా ‘నా సామిరంగ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ బిన్నీ మాట్లాడుతూ.. “నా సామిరంగ చాలా రకాలుగా స్పెషల్ మూవీ. ఈ పండక్కి పండగలా వుంటుంది. నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ గారు నాలాంటి ఒక కొత్త దర్శకుడిని ప్రోత్సహించారు. ఎప్పటికీ ఆయన్ని మర్చిపోలేను. పవన్ గారికి థాంక్స్. నా రైటర్స్ ప్రసన్న, థామస్‌కి థాంక్స్. డీవోపీ శివన్న, ఆర్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు నా టెక్నికల్ టీమ్ అందరికీ పేరుపేరునా థాంక్స్. ఎంఎం కీరవాణి గారు ఒక కొత్త దర్శకుడుకి ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. చంద్రబోస్ గారు చాలా అద్భుతమైన సాహిత్యం అందించారు” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ ఆషిక, మిర్నా. రుక్షర్ ముగ్గురూ చక్కగా నటించారు. నేను డైరెక్షన్ చేస్తుంటే అందరికంటే హ్యాపీగా ఫీలయ్యేది రాజ్ తరుణ్. నరేష్ గారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంజి అనే పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కింగ్ అక్కినేని నాగార్జున గారు నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి. నన్ను దర్శకుడిని చేసిన రియల్ హీరో నాగార్జున గారు. నాగార్జున గారితో వున్న అనుబంధం ఎంతో ప్రత్యేకం. నాగార్జున గారికి పాదాభివందనం. లైఫ్ లాంగ్ నా ఫేవరేట్ హీరో, గుండెల్లో ఉండిపోయే హీరో కింగ్ నాగార్జున గారు. గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి అక్కినేని అభిమానాలు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. వారందరికీ ధన్యవాదాలు. సినిమా చూడండి. ప్రోత్సహించండి. సినిమా బావుంటే నాగార్జున గారు నాలాంటి మరో పదిమంది కొత్త దర్శకులని పరిచయం చేస్తారు. అందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు డైరెక్టర్ విజయ్ బిన్నీ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: