త్రివిక్రమ్ సినిమాల్లో చేసినప్పుడల్లా నా పర్ఫామెన్స్‌లో మ్యాజిక్ జరుగుతుంది – మహేష్ బాబు

Guntur Kaaram Pre-Release Event Mahesh Babu Says, Trivikram is More Than A Friend

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. గుంటూరులో ఫంక్షన్ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మీరందరూ త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఆయన ఐడియానే. మేమందరం ఎక్కడ ఫంక్షన్ చేయాలని చర్చించుకుంటుంటే ఆయన మీ ఊరిలో ఫంక్షన్ చేద్దాం సార్ అన్నారు. దానికి నేను సరే సార్ మా ఊళ్ళోనే చేయండని అన్నాను. ఇదిగో ఇప్పుడు మన ఊళ్ళోనే ఫంక్షన్ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. త్రివిక్రమ్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు స్నేహితుడు కంటే ఎక్కువ. నా కుటుంబ సభ్యుడిలాగా. నేను ఆయన గురించి బయట ఎప్పుడూ మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ ఏం మాట్లాడతాం” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కానీ ఈ గత రెండు సంవత్సరాలు ఆయన నాకిచ్చిన సపోర్ట్, స్ట్రెంత్ నేనెప్పుడూ మర్చిపోలేను. థాంక్యూ సార్. మీకు థాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు. ఎందుకంటే మనం ఎప్పుడూ ఇలా మాట్లాడుకోము. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో నేను చేసినప్పుడల్లా నా పర్ఫామెన్స్ లో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అది నాకు తెలియదు. అతడు నుంచి మా ప్రయాణం మొదలైంది. ఖలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది. అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరుకారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. నేనెప్పుడూ ఇలా చెప్పలేదు. ఇవి మనసులోనుంచి వచ్చే మాటలు. అభిమానుల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. లవ్ యు సార్” అని తెలిపారు.

అలాగే చిత్ర నిర్మాత గురించి వివరిస్తూ.. “మా నిర్మాత చినబాబు గారు.. ఇది నాకు ఆయన చెప్పలేదు కానీ నాకు తెలుసు. ఆయన బాగా ఇష్టపడే హీరోని నేనే. మానిటర్ చూసినప్పుడు ఆయన ముఖంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్ లో సీన్స్ చూసినప్పుడు ఆయన ముఖంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందమేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా. థాంక్యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు, డైరెక్టర్ గారికి తెలుసు మీరు ఎంత సపోర్ట్ చేశారో. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని మహేష్ బాబు చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − three =