నాగార్జున నా సామిరంగ ను ఎందుకు పటు బట్టి సంక్రాంతికి తీసుకువస్తున్నాడో నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.సంక్రాంతి కోసమే తీసిన సినిమా ఇది.ఓ మలయాళ సినిమాకు ఫ్రీమేక్ గా వస్తుంది.కేవలం 70రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి బరిలో నిలుపింది టీం.అలాగని క్వాలిటీ కంటెంట్ విషయంలో రాజీపడలేదట.సూపర్ హిట్ గ్యారెంటీ అని ఇన్సైడ్ టాక్.సెన్సార్ వాళ్ళు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 24గంటల్లో 6మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.పండగకి పర్ఫెక్ట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నారు.ఈసినిమాలో నాగార్జున కు జోడిగా ఆషికా రంగనాథ్ కనిపించనుండగా యువ హీరోలు నరేష్,రాజ్ తరుణ్ లకు జోడిగా మిర్న ,రుక్షార్ ధిల్లాన్ కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్ట్ చేశాడు.డైరెక్టర్ అతనికి ఇదే మొదటి సినిమా. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించగా జనవరి 14న విడుదలకానుంది.మరి సంక్రాంతికి ఆఖరి సినిమాగా వస్తున్న నా సామి రంగ ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: