గుంటూరు కారం.. రమణ గాడి జాతర మొదలు అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్

Guntur Karam Movie Advance Booking Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాకు మంచి బజ్ ను తెచ్చిపెట్టాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే తెలంగాణలో మిడ్ నైట్ షోలకు సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరోవైపు టికెట్ రేట్లు కూడా పెంచారు. ఏపీలో 50 రూపాయలు పెరిగింది. ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. మహేష్ సత్తా ఏంటో అడ్వాన్స్ బుకింగ్స్ తో మరోసారి తెలిసింది. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. హైద్రాబాద్ లో అప్పుడే 5కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ఏలో కూడా ఈసినిమా అడ్వాన్స్ సేల్స్ లో రికార్డు క్రియేట్ చేసింది. 1 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ జరిగాయి అక్కడ.

ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + eighteen =