సైంధవ్…సీనియర్ హీరో వెంకటేష్ చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించిన సినిమా.అంతే కాదు వెంకీకి ఇది 75వసినిమా.సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది.ఈ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.పోస్టర్స్ తోపాటు టీజర్, సాంగ్స్ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి దాంతో సాలిడ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది.ఇక నిన్న విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ ను మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపి ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు.యూట్యూబ్ లో ఇప్పటివరకు 3మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక వెంకటేష్ నటించిన చివరి రెండు సినిమాలు డైరెక్ట్ గా ఓటిటిలోనే విడుదలయ్యాయి దాంతో చాలా కాలం తరువాత థియేట్రికల్ రిలీజ్ తో వస్తున్నాడు మరి సైంధవ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్ ,ఆర్య,నవాజుద్దిన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈసినిమా జనవరి 13న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: