న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ సూపర్ హిట్ హాయ్ నాన్న ఓటిటి లోకి వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను తెలుగు తోపాటు హిందీ,మలయాళ, కన్నడ,తమిళ భాషల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇప్పటికే ఓటిటి లో చూసిన వారు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.ఇక ఈ సినిమా థియేటర్లలో ఇంకా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.హాయ్ నాన్న నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 76కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద స్లో గా సార్ట్ చేసిన ఈసినిమా మౌత్ టాక్ వల్ల పుంజుకొని సూపర్ హిట్ అనిపించుకుంది.యూఎస్ఏ లో అయితే 1.8మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అయ్యింది.ఓవరాల్ గా నానికి ఇది తొమ్మిదో మిలియన్ డాలర్ సినిమా.ఎమోషనల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా శౌర్యువ్ తెరక్కించిన ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.వైరా ఎంటెర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఇక దసరా,హాయ్ నాన్నతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన నాని హ్యాట్రిక్ ఫై కన్నేశాడు.అందులో భాగంగా ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.ఈసమ్మర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.మరి ఈసినిమాతో నాని హ్యాట్రిక్ కొడతాడో
లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: