గుంటూరు కారం నుండి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్

meenakshi chaudhary first look released from guntur kaaram movie

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఫ్యాన్స్ మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా కాలమైపోయింది. దీంతో ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్, పాటలు కూడా రిలీజ్ చేశారు. అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా నుండి ఎన్నో అప్ డేట్లు వచ్చినా మీనాక్షి లుక్ ను మాత్రం ఇంతవరకూ రిలీజ్ చేయలేదు. దీంతో ఆమె లుక్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఇన్నిరోజులకు మీనాక్షి లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాజి అనే పాత్రలో మీనాక్షి కనిపిస్తుంది. మహేష్ తో పాటు మీనాక్షి ఉన్న ఈ పోస్టర్ చాలా బాగా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 4 =