హనుమాన్ కోసం చిరంజీవి 

Megastar chiranjeevi will grace the HANUMAN Mega Pre-Release Utsav

స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచింది హనుమాన్.స్టార్ కాస్ట్ ఎవరు లేరు కానీ బడ్జెట్ మాత్రం చాలా పెట్టేశారు.ట్రైలర్ సినిమాఫై అంచనాలను క్రియేట్ చేసింది.థియేట్రీకల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 20కోట్లు  చేసింది.సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దదే.హనుమాన్ ఒక్క తెలుగులోనే కాదు స్పానిష్ ,చైనీస్,జపనీస్ ఇలా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో కూడా విడుదలవుతుంది.ఇక ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతు సాయం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రమోషన్స్ లో భాగంగా హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 7న ఎన్ కన్వెన్షన్ లో జరుగనుంది. ఈ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిథి గా రానున్నాడు దాంతో సినిమాకు హైప్ పెరగనుంది.యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో తేజా సజ్జా హీరోగా నటించగా అమృతా అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్ ,వినయ్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించున్నారు.నిరంజన్ రెడ్డి నిర్మించాడు.

ఇక ఈసినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం విడుదలవుతున్న రోజే వస్తుంది.అయితే కంటెంట్ మీద వున్న నమ్మకంతో హనుమాన్ మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు.దాంతో వెనక్కి వెళ్ళడానికి నో అంటున్నారు.మరి గుంటూరు కారం పోటీ ని తట్టుకొని హనుమాన్ ఎంత వరకు ఓపెనింగ్స్ ను రాబట్టుకుంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.