కాజల్ సత్యభామ భారీ షెడ్యూల్ కంప్లీట్

kajal aggarwal satyabhama movie completed a long schedule

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఆ తరువాత చందమామ సినిమాతో హిట్ అందుకొని ఆతరువాత కెరీర్ లో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. అలా టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్. పెళ్లి తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోతుంది. 2023లో ఇప్పటికే భగవంత్ కేసరి లాంటి హిట్ సినిమాతో హిట్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా కాజల్ మరో సినిమాతో వచ్చేస్తుంది. అయితే మొదటిసారి లేడీ ఒరియెంటెండ్ సినిమాతో వస్తుంది. సత్యభామ అనే టైటిల్‌ తో ఈసినిమా వస్తుంది. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇప్పుడు ఈసినిమా షూటింగ్ కు సంబంధించి తాజాగా ఒక అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ 90శాతం పూర్తయినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ లో కాజల్ భారీ యాక్షన్ సీన్స్ చేసిందట. ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారు. ఈ యాక్షన్ సీక్వెన్సులు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.

కాగా అఖిల్ డేగల ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబి తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + six =