విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. చాలా రోజుల తరువాత నాగార్జున నుండి వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగనుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి రోజుకో అప్ డేట్ ను ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు, అల్లరి నరేష్ ఇంట్రో వీడియో, రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో, అలానే పాటలు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమాలో అల్లరి నరేష్ కు జోడీగా నటించే హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. మిర్నా ఈసినిమాలో అల్లరి నరేష్ కు జోడిగా నటించనుంది. ఈనేథ్యంలో అంజి గాడి ప్రాణం అంటూ మిర్నా ఈసినిమాలో గంగ పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా అంజి గాడి ప్రాణం❤️
Introducing Gorgeous @mirnaaofficial as మంగ🤩🔥
Witness her enthralling performance in theatres from January 14th!😍#NaaSaamiRanga #NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi
KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun… pic.twitter.com/BecZNVjSOk
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 4, 2024
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్,రుక్సార్ థిల్లన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ తరుణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: