సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ను బట్టి. ఇక ఈసినిమా ట్రైలర్ ను జనవరి 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అదేరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుండగా ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైపోయింది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు. ఇక ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. చూడగానే మజా వస్తుంది.. హార్ట్ బీట్ పెరుగుతుంది.. ఈల వేయాలి అనిపిస్తుంది అంటూ నిర్మాత నాగవంశీ పోస్ట్ లో పేర్కొన్నాడు.
చూడగానే మజా వస్తుంది
హార్ట్ బీట్ పెరుగుతుంది
ఈల వేయాలి అనిపిస్తుంది!blockbuster bomma loading
remember the date and time
jan4th 💥🔥 pic.twitter.com/gEmcAyiSsN— Naga Vamsi (@vamsi84) January 4, 2024
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: