సైంధవ్ ఎమోషనల్ బుజ్జికొండవే సాంగ్ రిలీజ్

BujjiKondave Song out from saindhav movie

టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ నుండి సినిమా వచ్చి రోజులు అవుతుంది. నిజానికి వెంకీని సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులవుతుంది. దీంతో ఫ్యాన్స్ వెంకీ సినిమా కోసం ఆసక్తికరంగా ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకీ వస్తున్న సినిమా సైంధవ్. ఈసినిమాతో వెంకీ మళ్లీ మాస్ అండ్ యాక్షన్ తో అలరించనున్నారు. ఈసినిమా పొంగల్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రాంగ్ యూసేజ్ అంటూ ఫస్ట్ పాటను రిలీజ్ చేయగా ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో పాటతో వచ్చేశారు. బుజ్జికొండవే అంటూ వచ్చే హార్ట్ టచింగ్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఎమోషనల్ గా ఉన్న ఈసాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్,ఆండ్రియా జెర్మియా ,రుహాణి శర్మ ,ఆర్య ,నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.