మార్నింగ్ షో బబుల్‌గమ్ చూసి, తర్వాత సలార్‌కి వెళ్ళండి – అడివి శేష్

Adivi Sesh Interesting Comments at Bubblegum Movie Pre Booking Event

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ బుకింగ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది. హీరోలు అడివి శేష్, విశ్వక్ షేన్, సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ నందిని రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ఈ వేదికపై ఉన్న చాలామందితో నా ప్రయాణం మొదలైంది. నా మొదటి హిట్.. రవికాంత్ మొదటి సినిమా. అలాగే శ్రీచరణ్ మొదటి సినిమా కూడా. ఈ సినిమా టీమ్‌ నా కుటుంబంలాంటిది. సుమ గారు కెరీర్ బిగినింగ్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారు. రోషన్ బబుల్‌గమ్‌తో డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బబుల్‌గమ్ బ్యూటీఫుల్ మూవీ అనిపిస్తోంది. మా గురువు గారు అబ్బూరి రవి గారు ఈ సినిమాకి చిన్న గైడెన్స్ ఇచ్చారు. చాలా మంచి టీంతో కలసి చేసిన సినిమా ఇది” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కన్న బిడ్డ తొలిసారి హీరోగా నటించిన సినిమా లాంచ్ అవ్వబోతుంటే పేరెంట్స్ కళ్ళలో ఓ ఆనందం వుంటుంది. అది సుమ, రాజీవ్ గారి కళ్ళలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని అందరూ సపోర్ట్ చేయాలి. మార్నింగ్ షో బబుల్‌గమ్ చూసి తర్వాత సలార్ కి వెళ్ళండి (నవ్వుతూ). మనం ఒకట కోరుకుంటే అది సాధించగలమనే వైబ్ ఈ సినిమాలో వుంది. ఆ డైలాగ్ విన్నపుడు నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. మీ అందరికీ వస్తుందని నమ్ముతున్నాను. డిసెంబర్ 29న అందరూ థియేటర్స్ లో బబుల్‌గమ్ చూడాలి’ అని అడివి శేష్ కోరారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =