బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి రిలీజ్ వరకూ ప్రతి మంగళవారం ఏదో ఒక అప్ డేట్ ఇస్తామని చెప్పినట్టే.. మేకర్స్ ఆదిశగా ప్రతి మంగళవారం ఒక అప్ డేట్ తో వస్తున్నారు. ఇప్పటికే పలు అప్ డేట్లు ఇచ్చారు. పోస్టర్లు రిలీజ్ చేశారు, పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అన్ని అప్ డేట్లు కూడా సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ట్రైలర్ ను అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తుంటే విఎఫ్ఎక్స్ పై చాలా కేర్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. విజువల్స్ లో ఆ క్లారిటీ కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది.
When DARKNESS eclipses DHARMA, The ANCIENTS shall RISE again 🔥
Embark on a surreal odyssey,#HanuManTrailer Out Now ❤️🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 #HanuMan In cinemas from JAN 12, 2024 💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5… pic.twitter.com/GepsB1tBUZ— Primeshow Entertainment (@Primeshowtweets) December 19, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: