సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు, అలానే దమ్ మసాలా సాంగ్ అలానే ఓ మై బేబీ అనే పాటలను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా షూటింగ్ ఇంకా పూర్తికాలేదు కానీ అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం అప్పుడే ఈసినిమా తన సత్తాను చాటుతుంది. యూకే లో ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈనేపథ్యంలో అలామొదలయ్యాయో లేదో హాఫ్ డేే లోనే వెయ్యి టికెట్లు బుక్ అయ్యాయి. 16 లొకేషన్స్ లో 16 షోలకు గాను వెయ్యికి పైగా టికెట్లు బుక్ అయినట్టు తెలుస్తుంది. మరి రిలీజ్ కు ఇంకా చాలా రోజులు ఉండగానే ఇలా ఉంటే రిలీజ్ కు ఏ రేంజ్ లో బుక్ అవుతాయో చూడాలి.
ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: