మంచు వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మనోజ్. కెరీర్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈమధ్య సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో మనోజ్ హీరోగా వస్తున్న సినిమా వాట్ ద ఫిష్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాను ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇప్పటికే పలు పోస్టర్లు అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే చాలా రోజుల నుండి ఈసినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈనేపథ్యంలో నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.
పోస్టర్‌లో నిహారిక స్టైలిష్‌గా నడుస్తూ ఉండగా.. తన వెనుక డాలర్ ఇమేజ్ వుంది. అంతేకాదు ఈసినిమాలో ఆమె పాత్ర అష్టలక్ష్మి అకా ఏయస్ హెచ్ నటిస్తుంది. ఇప్పటి వరకూ కనిపించని పాత్రలో నిహారిక చేయబోతున్నట్టు పోస్టర్ ను బట్టే అర్థమవుతుంది.
కాగా ఈసినిమాను 6ix సినిమాస్ ఇంకా afilmbyv బ్యానర్స్ పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: