బిగ్ బాస్ 7.. ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు వేస్తున్న సంగతి తెలిసిందే కదా. సోమవారం అమర్, అర్జున్ ల జర్నీ వీడియోలు వేయగా..మంగళవారం ప్రియాంక, శివాజీ వీడియోలు వేశారు. ఇక బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక నేడు మిగిలిన హౌస్ మేట్స్ ప్రశాంత్, యావర్ ల వీడియోలను వేసి చూపించాడు బిగ్ బాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముందుగా యావర్ ను పిలిచాడు బిగ్ బాస్. ఇక లాన్ లో ఉన్న మెమరీస్ బుక్ లో ఉన్న ఫొటోలను చూస్తూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక 17 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో యావర్ అన్ని ఎమోషన్స్ ను చూపించాడు. బిగ్ బాస్ కూడా యావర్ కు ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఇచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చిన సర్ ప్రైజ్ వీడియోకు సంతోష పడిన యావర్ హ్యాపీగా ఫీలవుతూ నాకు కోపం ఉందని అందరూ అంటారు.. కానీ నాలో చరిత్ర సృష్టించే అంత దమ్ముంది అంటూ తెలిపాడు.
అనంతరం ప్రశాంత్ వీడియోను వేసి చూపించాడు బిగ్ బాస్. ప్రశాంత్ కూడా మెమరీస్ బుక్ ను చూసుకొని మురిసిపోయాడు. తన తండ్రితో ఉన్న ఫొటోను చూసి ఏడ్చేశాడు. ఆ తరువాత వీడియోను వేశాడు బిగ్ బాస్. ఇక ప్రశాంత్ వీడియోలో కూడా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వీడియో చూసిన ప్రశాంత్ ఏడుస్తూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో బుధవారం ఎపిసోడ్ ముగుస్తుంది.
మరి హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు చివరి వారం కాబట్టి టాప్ 5 ఉంచుతారా లేక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా అన్నది చూడాలి. అంతేకాదు ఈ సీజన్ ఎవరు కప్ ను గెలుచుకుంటారో తెలియాలంటే వీకెండ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: