బిగ్ బాస్ 7.. ఇంటినుండి బయటకు వచ్చేసిన శోభా శెట్టి

shobha shetty eliminated from bigg boss season 7

మొత్తానికి బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానే ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 7 అలా వచ్చి ఇలా అయిపోతుంది. చూస్తుండగానే 14వారాలు పూర్తిచేసుకుంది. ఫైనల్ వారంలోకి అడుగుపెట్టేసింది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. మరి ఈఆదివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వారం హౌస్ లో ఏ రేంజ్ లో గొడవలు జరిగాయో చూశాం. ఇక వాటిని తేచ్చే పనిలో పడ్డారు నాగార్జున. అర్జున్, ప్రియాంకను తప్పా మిగిలిన వారందరినీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి వారికి క్లాస్ లు పీకారు నాగార్జున. ఇక ఆదివారం ఎపిసోడ్ లో పలు గేమ్స్ ను పెట్టాడు. అందులో భాగంగా ముందుగా 14 వారాల్లో మీరు ఏ వారం పశ్చాత్తాపం గా ఫీలవుతున్నారు? ఎందుకు? అనే గేమ్ ను పెట్టారు. ఈనేపథ్యంలో ముందుగా ప్రియాంక వచ్చి 7వ వారంలో భోలేని ఓ మాట అనకుండా ఉండాల్సింది అని చెప్పింది. ఇంకా శోభా 9వ వారంలో యావర్ ను పిచ్చోడు అని అనకుండా ఉండాల్సింది అంటూ తెలిపింది. అమర్ 14వ వారంలో అలా బిహేవ్ చేయకుడా ఉండాల్సింది అని.. శివాజీ వచ్చి 14వ వారంలో ఆడపిల్లల్ని అలా అనకుండా ఉండాల్సిందని తెలిపారు. ఆ తరువాత వచ్చిన యావర్ తనకు 4 వారాలు ఉన్నాయని తన రీజన్స్ చెప్పాడు.

ఆ తరువాత ఎవరి నుండి ఏమేం నేర్చుకున్నారు అన్న టాస్క్ ను ఇవ్వగా ముందుగా అమర్ వచ్చి ప్రశాంత్ దగ్గర గేమ్ ఆడటం..అర్జున్ దగ్గర నిజాయితీ నేర్చుకున్నాని తెలిపాడు. యావర్ వచ్చి శివాజీ దగ్గర ఓపికగా ఉండటం నేర్చుకున్నానని తెలిపాడు. ప్రియాంక వచ్చి అమర్ లా ఫౌల్స్ ఆడకూడదని నేర్చుకున్నా అని తెలిపింది. ఆ తరువాత వచ్చిన అర్జున్.. శివాజీ దగ్గర లౌక్యం, యావర్ దగ్గర పట్టుదల, ప్రియాంక దగ్గర అందరితీ నవ్వుతూ మాట్లాడటం, ప్రశాంత్ దగ్గర గొడవ అయినా కూడా ఆ తరువాత కలిసిపోయి మాట్లేడే తత్వం నేర్చుకున్నా అంటూ తెలిపాడు. శోభా ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు అని చెప్పింది

అనంతరం ఫైనలిస్ట్ లను ప్రకటించాడు నాగర్జున. ఫినాలే టికెట్ ను గెలుచుకోవడంతో అర్జున్ మొదటి ఫైనలిస్ట్ గా నిలుస్తాడు. ఆతరువాత యావర్ ను, ప్రియాంకను, అమర్ ను, ప్రశాంత్ ను ఫైనలిస్ట్ లుగా ప్రకటిస్తారు. చివరిగా శివాజీ, శోభాను పెట్టి శోభా ఎలిమినేట్ అయింది.

మరి ఫైనల్ వీక్ వచ్చేసింది. హౌస్ లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. టాప్ 5 ఉంచుతారా లేక మిడి వీక్ ఎలిమినేషన్ ఉంటుందా అన్నది మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది. ఇక ఫైనల్ కప్ ఎవరు గెలుచుకుంటారో తెలియాలంటే ఈ వీకెండ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + fifteen =