డైరెక్టర్ క్రిష్ చేతులమీదుగా.. హద్దు లేదురా ఫస్ట్ లుక్ రిలీజ్

Director Krish Jagarlamudi Launches Haddu Ledura Movie First Look

టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన నూతన చిత్రానికి ”హద్దు లేదురా..” #FRIENDSHIP అనే టైటిల్ని ఖరారు చేశారు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మాతగా, రావి మోహన్ రావు సహా నిర్మాతగా, యువ దర్శకుడు రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, అశోక్ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ‘హద్దు లేదురా’.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా వీటిని రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. ‘హద్దు లేదురా’ అనే టైటిల్ చాలా బావుందని అన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు థీమ్ వైవిధ్యంగా ఉందని పేర్కొన్న ఆయన ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక డైరెక్టర్ రాజశేఖర్ రావి మాట్లాడుతూ.. అలనాటి కృష్ణార్జునులు స్నేహితులు అయితే ఎలా ఉంటారో తెలిపే కథ, కథనం హైలైట్ గా నిలుస్తాయని, ఫైట్స్, పాటలు సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ముఖ్యంగా క్లైమాక్స్ తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని చెప్పారు.

అలాగే నిర్మాత గాజుల వీరేశ్ మాట్లాడుతూ.. ‘రుద్రాంగి’ చిత్రంలో తన నటనతో అందరిని ఆకట్టుకున్న హీరో ఆశిష్ గాంధీ సీన్స్, డైరెక్టర్ రావి రాజశేఖర్ కథని తీర్చిదిద్దిన విధానం, సంభాషణలు ఈ చిత్రనికి హైలెట్ గా నిలుస్తాయని, త్వరలో టీజర్ , ఆడియో వేడుకను నిర్వహించి, జనవరి చివరలో మీ ముందుకు తీసుకువస్తామని తెలిపారు. కాగా హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. అర్జున్, కృష్ణ మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ సీన్స్ అన్ని ఈ జనరేషన్ కి, యూత్ బాగా కనెక్ట్ అవుతాయని, చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్షిప్ నేపద్యంలో వచ్చే ఈ సినిమా నాకు, దర్శకనిర్మాతలకు మంచిపేరు తీసుకొస్తుందని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.