సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్‌.. డబ్బింగ్ పూర్తి చేసిన పృథ్వీరాజ్

Prithviraj Sukumaran Completes His Dubbing For Salaar Cease Fire

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌’. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ మూవీ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్‍ ఫైర్’ సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఇటీవలే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సలార్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. మూవీ లవర్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. అందులోని యాక్షన్ సీక్వెన్స్,విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండి ఒక్కసారిగా సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తన డబ్బింగ్ ను పూర్తి చేశారు. కాగా ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘వరదరాజ్ మన్నార్‌’ అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.

కాగా తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న సలార్ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వ‌రీ రావు తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు ‘కేజీఎఫ్‌’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం మరియు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nine =