ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాలో సలార్ సినిమా ఒకటి. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా రెండు పార్టులుగా రానుండగా.. అందులో ఫస్ట్ పార్ట్ సలార్-సీజ్ ఫైర్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానుంది. ఎన్నోసార్లు వాయిదా అనంతరం ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి ఏ సర్టిఫికెట్ లభించింది. దీంతో 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈసినిమాను చూడగలరు. మరోవైపు కొంతమంది ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. అంతేకాదు ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కోసం వెయిట్ చేయండి అంటూ తెలిపారు. ఈసినిమా రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తుంది.
Censor done for #SalaarCeaseFire 🔥
Get ready for an intense ‘𝐀’ction drama in cinemas from December 22nd 💥#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @SalaarTheSaga… pic.twitter.com/buI92rKuyL
— Telugu FilmNagar (@telugufilmnagar) December 11, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























