బిగ్ బాస్ 7- ఓటు అప్పీల్ కు ఛాన్స్

bigg boss season 7 telugu shobha won vote appeal chance

బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు వారాల్లో ముగియనుంది. ఈ సారి ఉల్టా పుల్టా అంటూ మొదలైన ఈ సీజన్లో పేరుకు తగ్గట్టే ఉల్టా పుల్టాగా సాగింది. ఎన్నో ట్విస్ట్ లతో అలరించాడు బిగ్ బాస్. ఇక ఈవారం ఫైనల్ నామినేషన్ కూడా పూర్తయిపోయింది. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్ లను నామినేట్ చేయాలి. అలానే నామినేట్ చేశారు హౌస్ మేట్స్. అయితే అక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈవారం నుండే జరిగే ఓటింగ్ నే ఫైనల్ వరకూ ఉంటుంది.. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విజేత అంటూ ట్విస్ట్ ఇస్తాడు. దీంతో ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ కు వాళ్లే ఓట్లు వేసుకోవాల్సి ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత వారం ఫినాలే టికెట్ కోసం పోటా పోటీగా టాస్క్ లు జరిగాయి. ఇక ఈ వారం మరో కాన్సెప్ట్ తో వచ్చేశాడు బిగ్ బాస్. ఈ వారం హౌస్ మేట్స్ కు ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అయితే దానికి పలు గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. చిల్ పార్టీపేరుతో పలు గేమ్స్ ఉంటాయని.. వాటిలో గెలిచిన వారికి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపాడు. దీనిలో భాగంగా ముందుగా ఒక గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. పాట ప్లే చేస్తాడు… ఆ వెంటనే హౌస్ మేట్స్ బెంచ్ పై ఉన్న వస్తువుల్లో ఒకదాన్ని తీసుకొని పూల్ లో దూకాలి. ఈ టాస్క్ లో ఫైనల్ గా యావర్ గెలుస్తాడు. ఆతరవాత కలర్స్ జంపింగ్ గేమ్ ఇస్తాడు. ఈ గేమ్ లో మూడు కలర్స్ ఉంటాయి.. బిగ్ బాస్ ఏ కలర్ చెబితే వారు జంప్ చేసి ఆ కలర్ లో కాలు పెట్టాలి..ఈ టాస్క్ లో శోభా ఫైనల్ గా గెలుస్తుంది.

మొదటి గేమ్ లో యావర్ గెలవగా రెండో గేమ్ లో శోభా గెలువగా ఇక్కడ కూడా మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఓటింగ్ ప్రాసెస్ పెట్టాడు. ఇందులో ముందుగా వచ్చిన అర్జున్ తన ఓటు శోభా కే వేస్తూ ఓటింగ్ కూడా బాటమ్ లో ఉందని.. ఓటు అప్పీల్ ఛాన్స్ తనకు ఇప్పుడు అవసరమని రీజన్ చెబుతాడు. ఆ తరువాత ప్రియాంక అర్జున్ పాయింట్ తో ఏకీభవిస్తున్నానని.. యావర్ నువ్వు స్ట్రాంగ్ మళ్లీ గేమ్ లు పెట్టినా గెలుస్తావు అని చెప్పింది.. దానికి నేను స్ట్రాంగ్ అంటే శోభా వీక్ అంటున్నావా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. మరో వైపు శోభా కూడా నేను వీక్ అంటే ఒప్పుకోనని ప్రియాంకకు షాకిచ్చింది. ఫైనల్ గా తన ఓటు అయితే శోభాకు వేసింది. ప్రశాంత్ ఫినాలే టికెట్ టాస్క్ లో తన పాయింట్లు నాకు ఇచ్చాడు.. ఇప్పుడు నేను అవకాశం ఇస్తున్నా అంటూ యావర్ కు ఓటు వేశాడు.. అమర్ నా ఫ్రెండ్ శోభా తనకే నా ఓటు అంటూ శోభాకు ఓటు చేశాడు. శివాజీ ముందు టాస్క్ లో గెలిచింది యావర్ కాబట్టి నా ఓటు యావర్ కు అంటూ రీజన్ చెప్పాడు. దీంతో మూడు ఓట్లు రావడతో శోభాకు ఓటు అడిగే ఛాన్స్ వస్తుంది.

అందరికీ మోనితగానే తెలుసు.. బిగ్ బాస్ ద్వారా శోభా శెట్టిగా తెలుసు..నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి మీ సపోర్టే కారణం.. ఈసీజన్ ఉల్టా పుల్టా గా మొదలైంది.. అలానే బిగ్ బాస్ 7 అమ్మాయిగా నేను గెలవాలి..బిగ్ బాస్ గెలిస్తే వచ్చేఅమౌంట్ నాకు చాలా అవసరం.. మీ సపోర్ట్ నాకు కావాలి.. నాకు తెలియకుండా ఎమైనా తప్పులు చేస్తే క్షమించండి అంటూ ఓటు కుఅప్పీల్ చేసుకుంది. దీంతో మంగళవారం ఎపిసోడ్ ముగుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.