యంగ్ హీరో నితిన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే సరైన హిట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ తో వచ్చేస్తుంది. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయితే టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నితిన్. ఈనేపథ్యంలో నితిన్ ను మీ అల్లరి బుల్లోడు సినిమా టైమ్ లో న్యాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు కదా మీ బాండింగ్ ఎలా ఉండేది అని అడిగగా దానికి నితిన్ ఆ టైమ్ లో సెట్ లో మేమిద్దరమే ఎక్కువ మాట్లాడుకునే వాళ్లం.. నన్ను పేరుతో పిలిచేవాడు.. అయితే అప్పుడు ప్రొడ్యూసర్స్ తను హీరో పేరుతో పిలుస్తావేంటి అని అడిగారు..కానీ నేను మాత్రం వాళ్లు అన్నవి ఏం పట్టించుకోవద్దు..నన్ను పేరుతోనే పిలువు.. అవసరమైతే నిట్స్ అని పిలువు అని చెప్పాను. అప్పటినుండి సెట్లో నిట్స్ అని నాని ఒక్కడే పిలిచేవాడు అని చెప్పారు. ఇంకా గతంలో ఒకసారి మా ఇద్దరి సినిమాలు ఒకే టైమ్ లో రిలీజ్ అయ్యాయి.. ఇప్పుడు మళ్లీ ఇద్దరి సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి.. రెండు సినిమాలూ మంచి హిట్ కొట్టాలని ఇండస్ట్రీ బావుండాలని కోరుకుంటున్నా అని తెలిపాడు.
An Extra Ordinary Recall👌@actor_nithiin shares about his bond with Natural star @NameisNani during the shoot of his film, for which #Nani worked as an assistant director!🎞️#Nithiin #Nani #ExtraOrdinaryMan #HiNanna #TeluguFilmNagar pic.twitter.com/JPWWFDRU6x
— Telugu FilmNagar (@telugufilmnagar) December 4, 2023
కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: