సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా రత్నం. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. చాలా వరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇన్ని రోజులు విశాల్ 34 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంది. అయితే ఈ సినిమా టైటిల్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రత్నం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. దీనితో పాటు ఫస్ట్ షాట్ అంటూ టైటిల్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా విశాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక వ్యక్తి తలను నరికి, దాన్ని చేత్తో పెట్టుకుని, మరో చేత్తో రక్తం కారుతున్న కొడవలిని పట్టుకుని విశాల్ భయంకరంగా ఉంది.
Presenting the First Look posters of #Rathnam starring Puratchi Thalapathy @VishalKOfficial.
Tamil First Shot ▶️ https://t.co/zDK57jQBpq
Telugu First Shot ▶️ https://t.co/64s1UwZ7vA
A film by #Hari. Coming to theatres, summer 2024.@priya_Bshankar @ThisisDSP @stonebenchers… pic.twitter.com/FIGkpMEPCJ
— Stone Bench (@stonebenchers) December 2, 2023
కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: