స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఇక భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ఓలేఓలే పాపాయి సాంగ్ డ్యాన్స్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఫుల్ బీట్ తో ఉన్న మాస్ సాంగ్ డ్యాన్స్ ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ ను 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
Here comes #OleOlePaaPaayi 🤗https://t.co/uzKS73xIT5
Vibe in theatres on DEC 8th 🥳#ExtraOrdinaryMan#ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/9SLaRHAxSj
— nithiin (@actor_nithiin) December 2, 2023
కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























