బిగ్ బాస్ 7.. ఈ వారం మొత్తం హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లతో బిజీ బిజీగా ఉన్నారు హౌస్ మేట్స్. ఇప్పటికే పలు గేమ్స్ ను పెట్టగా గురువారం ఎపిసోడ్ పూర్తయ్యే సరికి ప్రశాంత్, అమర్, అర్జున్, గౌతమ్ లు బరిలో నిలిచారు. ఆతరువాత వదలకురా తడవకురా అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో కూడా ప్రశాంత్ గెలుస్తాడు. ఈ గేమ్ ముగిసే సరికి తక్కువ పాయింట్లు ఉండటంతో గౌతమ్ టాస్క్ నుండి ఔట్ అవుతాడు. దీంతో గురువారం ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక శుక్రవారం ఎపిసోడ్ అక్కడి నుండే మొదలవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాస్క్ లో ఓడిపోవడంతో తనదగ్గరున్న పాయింట్లను తనకు ఇష్టమున్న వారికి ఇవ్వమంటాడు బిగ్ బాస్. ముందుగా ప్రియాంక చెప్పినట్టు తన దగ్గరున్న పాయింట్లను అమర్ కు ఇస్తాడు గౌతమ్. ఇక రేసులో మిగిలిన ప్రశాంత్, అర్జున్, అమర్ లకు మరో టాస్క్ ను ఇచ్చాడు. కలర్ బాల్స్ అన్నీ ఒకే వరుసలో సెట్ చేయాలని చెబుతాడు. ఈ టాస్క్ లో అర్జున్ గెలుస్తాడు. ఆ తరువాత పట్టువదలకురా ఢింబకా అనే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ లో ముగురూ ఒక బెస్ట్ లోపల ఉంటారు. బయట జెండాలు ఉంటాయి. వాటిని తీసుకొని తమ బుట్టలో వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ కాస్త భుజబలానికి సంబంధించి ఉంటుంది. ఉన్న ముగ్గురిలో అర్జున్ కాస్త బలంగా ఉంటాడు కాబట్టి ఈ టాస్క్ తనకు బాగా కలిసొచ్చింది. అర్జునే ఈ టాస్క్ లో గెలుస్తాడు.
ఈ టాస్క్ పూర్తయ్యే సరికి ప్రశాంత్ దగ్గర తక్కువ పాయింట్లు ఉండటంతో ప్రశాంత్ రేస్ నుండి తప్పుకున్నాడు. ఫైనల్ గా రేస్ లో అర్జున్, అమర్ నిలుస్తారు. ఫైనల్ గా వీరిద్దరికీ పాముతో చెలగాటం అనే టాస్ ను ఇస్తాడు. ఈ టాస్క్ లో బాల్ ను బ్యాలెన్స్ చేస్తూ గోల్ వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో అర్జున్ గెలుస్తాడు. దీంతో ఫినాలే టికెట్ ను సొంతం చేసుకొని మొదటి ఫైనలిస్ట్ అవుతాడు అర్జున్. దీంతో శుక్రవారం ఎపిసోడ్ ముగుస్తుంది.
మరి ఈవారం అమర్ తప్పా శివాజీ, యావర్, ప్రశాంత్, శోభా, ప్రియాంక, గౌతమ్, అర్జున్ అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు.ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























