బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా యానిమల్ ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా తెరకెక్కింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో సందీప్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఈసినిమాను మోస్ట్ వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించడంతో వచ్చిన అప్ డేట్లు అన్నీ మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ అయి ఎక్కడ చూసినా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. పాజిటివ్ రివ్యూ కూడా రావడంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాకు సందీప్ కథ, మేకింగ్, రణబీర్ కపూర్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. అసలైన వయోలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపించాడు సందీప్ రెడ్డి. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఒక్క రోజులోనే ఈసినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఒక ఇండియాలోనే దాదాపు రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసుకుంది. మరి ఒక్క రోజులోనే ఈ రేంజ్ లో కలెక్ట్ చేసింది అంటే ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం..
He has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/sIXDnGkfKu
— Animal The Film (@AnimalTheFilm) December 2, 2023
కాగా ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ నిర్మించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈసినిమా అమిత్ రాయ్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: