మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఈఏడాది పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఆడియో రైట్స్ ను ఐకాన్ మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టు తెలిపారు. అంతేకాదు ఫస్ట్ సింగిల్ ను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#EAGLE 🦅 Audio rights has been secured by @Iconmusicsouth 💥
First single will be out soon, stay tuned! 🎼
Worldwide Grand release on 𝐉𝐀𝐍 𝟏𝟑, 𝟐𝟎𝟐𝟒. 😎 #EAGLEonJan13th 🤘🏻@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@peoplemediafcy @KavyaThapar… pic.twitter.com/5Kvoa1wZ0R
— People Media Factory (@peoplemediafcy) December 2, 2023
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో నవదీప్,మధుబాల కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: