ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్ లో జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే అక్కడ షూటింగ్ ను జరుపుకుంటున్నారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ తో ఈసినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. శివలింగం ముందు విల్లు ఎక్కిపెట్టినట్టు ఉన్న మంచు విష్ణు లుక్ అయితే ట్రెమెండస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈయన కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈనేపథ్యంలో తాజాగా మేకర్స్ బ్రహ్మీ కి సంబంధించిన ఒక ఫన్నీ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన కాంబినేషన్ లో తెరకెక్కించిన ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు ఎక్కువ శాతం ఒక్క టేక్ లో ఓకే అవడంతో పాటు ఎంతో ఎంజాయ్ చేసాము అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
Bringing the curtain down on a fantastic 15-day shoot in New Zealand with king of comedy 𝐁𝐫𝐚𝐡𝐦𝐚𝐧𝐚𝐧𝐝𝐚𝐦 for #𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚🏹, where every shot, blessed with his infectious laughter and masterful action, unfolded seamlessly in one take 🎬 Grateful for the maestro’s… pic.twitter.com/9pDm7KNRZ8
— 24 Frames Factory (@24FramesFactory) December 1, 2023
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు నయనతార, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఈసినిమాలో నటిస్తున్నారు. ఇంకా పలువురు స్టార్లు ఈసినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: