గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఫైనల్ షెడ్యూల్ అప్‌డేట్

Anjali's Geethanjali Malli Vachindi Movie Final Schedule Begins

తెలుగు అమ్మాయి అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో వచ్చిన ‘గీతాంజ‌లి’ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజ‌లి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి అంటూ గీతాంజ‌లి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అయితే ఇది అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైందని వెల్లడించారు. ఈ మేరకు చిత్ర నిర్మాత కోన వెంకట్ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకోగా.. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు. కాగా ‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’ సీక్వెల్ స్టార్ట్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హార‌ర్ కామెడీ చిత్రాల‌న్నీ ఒక ఎత్తైతే ‘గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది’లో హార‌ర్ కామెడీ వాట‌న్నింటినీ మించేలా ఉంటుందని పేర్కొన్నారు. ఇక ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

కాగా యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి ఎప్పుడూ ముందుండే కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ఈ సినిమా ద్వారా త‌న మార్క్‌ను చాటుకుంటోంది. మ‌ల‌యాళ చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు రాహుల్ మాధ‌వ్‌ టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యమవుతున్నారు. అలాగే ‘నిన్ను కోరి’, ‘నిశ్శ‌బ్దం’ చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన అట్లాంటా (యూఎస్‌)కు చెందిన కొరియోగ్రాఫ‌ర్ శివ తుర్ల‌పాటిని డైరెక్ట‌ర్‌గా ఈ చిత్రంతో ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, సునీల్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 4 =