రత్నం అంటూ వచ్చేస్తున్న విశాల్

vishal new movie title revealed

తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా మార్క్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా టైటిల్ ను నేడు రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే ఈసినిమా టైటిల్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. రత్నం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు మేకర్స్. అంతేకాదు 2024 సమ్మర్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు.

కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =