సలార్, కేజీఎఫ్‍ లింక్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ

Prashanth Neel Gives Clarity on Interlink Between Salaar and KGF

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌’. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ‘కేజీఎఫ్‌’ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ మూవీ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్‍ ఫైర్’ సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. అయితే అంతకంటే ముందు డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ‘సలార్’ సినిమా గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. తాజాగా ఒక ఆంగ్ల వెబ్‌ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ సినిమా స్టోరీ గురించి కూడా కొంత రివీల్ చేశారు. ‘కేజీఎఫ్‌’తో ‘సలార్‌’ను పోల్చుకోవద్దనీ, ఈ సినిమా డిఫరెంట్ అని స్పష్టం చేశారు. సలార్‌లో ఫ్రెండ్‍షిప్ కోర్ ఎమోషన్ అని, బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే ఇదని ప్రశాంత్‌ నీల్‌ వెల్లడించారు. ఇందులో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్నేహితులుగా నటిస్తున్నారని తెలిపారు. ఇక సలార్: పార్ట్ 1 – సీజ్‍ఫైర్‌లో కథలో సగం కథే చెబుతామని, కథ డిమాండ్‌ మేరకు రెండో భాగాన్ని కూడా తీయాల్సి వచ్చిందనీ ఆయన వివరించారు. కాగా సినిమాను రెండు భాగాలుగా తీయాలని షూటింగ్‌ స్టార్ట్ చేసిన కొద్ధి రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్‌ తెలిపారు.

కాగా తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న సలార్ సినిమాలో ప్రభాస్‌ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వ‌రీ రావు తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాలో సలార్‌గా ప్రభాస్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ వరదరాజ్ మన్నార్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు ‘కేజీఎఫ్‌’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం మరియు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eleven =