తెలుగు రాష్ట్రాలు నన్ను దత్తత తీసుకోవాలని కోరుతున్నా – రణ్‌బీర్ కపూర్

Ranbir Kapoor Wants to be Him Adopted by Telugu States

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ‘యానిమల్’లో ర‌ణ్‌బీర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్‍గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‍లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ.. “తెలుగు చిత్ర పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. నా మొదటి సినిమాకి వచ్చినపుడు నా తొలి అటోగ్రాఫ్ హైదరాబాద్ లోనే ఇచ్చాను. ఇక్కడ ప్రేక్షకులు సినిమాల పట్ల చూపించే ప్రేమ ఆదరణ అద్భుతంగా వుంటుంది. తెలుగు రాష్ట్రాల అబ్బాయిగా వుండాలని వుంది. నన్ను దత్తత తీసుకోవాలని కోరుతున్నాను (నవ్వుతూ). ఈ చిత్రంలో చాలా విలక్షణమైన పాత్ర చేశాను. ఈ తరహా పాత్ర చేయడం నాకు తొలిసారి. నా పాత్ర చాలా ఇంటెన్స్ గా వుంటుంది. తన తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ వున్న కొడుకు పాత్రలో కనిపిస్తాను. కొన్నాళ్ళు క్రితమే మా నాన్న గారిని కోల్పోయాను. నాన్న గారు తన వృత్తి రీత్యా చాలా బిజీగా వుండేవారు. చిన్నప్పుడు ఆయనతో సరదాగా కలసి గడిపిన సందర్భాలు ఈ సినిమా చేస్తున్నప్పుడు గుర్తొచ్చాయి” అని తెలిపారు.

ఇంకా రణ్‌బీర్ ఇలా చెప్పారు.. “ఈ చిత్రంలో నా భార్య గీతాంజలి పాత్రతో కూడా చాలా ఘాడమైన ప్రేమలో వుంటాను. యానిమల్స్ అన్ ప్రెడిక్టబుల్ గా వుంటాయి. ఇందులో నా పాత్ర ఆ స్వభావంతో వుంటుంది. యానిమల్ కథ, పాత్రలు అందరికీ కనెక్ట్ అవుతాయి. అందరం చాలా హార్డ్ వర్క్ చేసిన ఈ చిత్రం చేశాం. సందీప్ యానిమల్ కథని చాలా సహజంగా గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా తీశారు. ఆడియన్స్ అందరూ తప్పకుండా కథ, పాత్రలకు కనెక్ట్ అవుతారు” అని పేర్కొన్నారు. కాగా రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే ‘కబీర్‌ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘యానిమల్’ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. రణ్‌బీర్‌ కపూర్‌ పూర్తి మాస్ క్యారెక్టర్లో నటిస్తుండటం.. అలాగే ‘కబీర్‌ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సందీప్ రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఇప్పటికే ‘యానిమల్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. రికార్డ్ స్థాయిలో కొన్ని గంటల్లోనే లక్షకు పైగా టికెట్స్ బుక్ అవ్వడం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.