ఏంసిఏ తరువాత చాలా గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్ తీశాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్.రెండేళ్ల క్రితం వచ్చిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ అయ్యింది.ఇక ఈ సినిమా తరువాత ఈ డైరెక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు.అంతకుముందే వీరి కాంబినేషన్ లో ఐకాన్ అనే టైటిల్ తో సినిమాను కూడా ప్రకటించారు.దిల్ రాజు ఈసినిమాకు నిర్మాత.అయితే ఏమైందో కానీ ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదు.ఆతరువాత దిల్ రాజు నిర్మాణం లోనే వేణు శ్రీరామ్,నితిన్ తో సినిమా చేయనున్నాడని అనౌన్స్ మెంట్ వచ్చేసింది.ఈసినిమాకు తమ్ముడు టైటిల్ పెట్టారు.అన్న- చెల్లెలు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా గురించి అప్డేట్స్ ఏం బయటికి రావడం లేదు కానీ తాజాగా నితిన్ లేటెస్ట్ గా ఓ అప్డేట్ ఇచ్చాడు అదేంటంటే తమ్ముడు లో హీరోయిన్ ఎవరో చెప్పేశాడు.కాంతార ఫేమ్ సప్తమి గౌడ ను హీరోయిన్ గా తీసుకున్నామని చెప్పాడు అలాగే ఈసినిమా ఐకాన్ కాదని కూడా క్లారిటీ ఇచ్చాడు.త్వరలోనే తమ్ముడు గురించి ప్రొడక్షన్ హౌస్ నుండి అప్డేట్ రానుంది.
ఇక నితిన్ ప్రస్తుతం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్స్ తో బిజీ గా వున్నాడు.వక్కంతం వంశీ డైరెక్ట్ చేయగా శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.నిన్న ఈసినిమా ట్రైలర్ ను కుడా రిలీజ్ చేశారు.సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ లో చెప్పేశారు.సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ గా చేయడం ఇందులో మరో ప్రత్యేకత.హారిస్ జైరాజ్ సంగీతం అందించగా శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.ఈడిసెంబర్ 8న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: