అథర్వ- ఇంట్రెస్టింగ్ గా స్నీక్ పీక్

karthik rajus atharva movie sneak peek released

మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాపై మరింత హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు అథర్వ టీమ్. ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక  ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి స్నీక్ పీక్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. స్నీక్ పీక్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేసింది. స్నీక్ పీక్ లో ఒక కుటుంబానికి చెందిన మూడు హత్యల గురించి ఉంటుంది. మూడు నిమిషాల పాటు ఉన్న ఈ సీన్‌ను సింగిల్ షాట్‌లో తీయడం విశేషం. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయట్ చేయాల్సిందే.

కాగా ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్నారు.నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 9 =