యంగ్ హీరో విజయ్ దేవరకొండ,డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి మేజర్ బ్రేక్ లేకుండా రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం నోయిడాలో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో లీడ్ పెయిర్ ఫై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ తరువాత ఈనెల 29నుండి యూఎస్ లో షూటింగ్ జరుగనుంది.ఈషెడ్యూల్ దాదాపు 15రోజులు కొనసాగనుంది.దాంతో షూటింగ్ దాదాపు పూర్తికానుంది.ఈసినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యామిలీ స్టార్ ను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలుపాలని దిల్ రాజు పట్టుదలతో వున్నాడు.దానికి తగ్గట్లే సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేస్తుంది టీం.అయితే సంక్రాంతికి వస్తే మాత్రం భారీ పోటీ తప్పేలా లేదు.ఎందుకంటే సంక్రాంతికి మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం,వెంకటేష్ సైంధవ్ అలాగే నాగార్జున నా సామి రంగ వస్తున్నాయి.దాంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండనుంది.అయితే అన్ని వేటికవే సెపరేట్ జోనర్ లో తెరకెక్కుతున్నాయి.ఇక ఫ్యామిలీ స్టార్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో పోటీ ఎంత వున్నాసినిమాను ఆదరిస్తారని దిల్ రాజు కాన్ఫిడెంట్ గా వున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: